ఆయువుపట్టు;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
 బాల పంచపదులు
==============
      వోటు
1.పద్దెనిమిదేళ్ళ వయోఅర్హత!
రాజ్యాంగమిచ్చే జనయోగ్యత !
  ప్రజాశక్తి చేతి అనన్య ఘనత!
 ప్రజారాజ్యం సుందర భవిత!
  వోటుగుట్టు,
          ఆయువుపట్టు,రామా!
2.లింగభేదం అసలు లేదు!
    అక్షరాస్యత అడ్డు రాదు!
    కులప్రసక్తికి  తావే లేదు!
    అధికారం అడగే లేదు!
   వోటుగుట్టు,
           ఆయువుపట్టు, రామా!
            వోటరు
3.లోభం తెలియని వోటు ,
                              పవిత్రం!
  ధర్మం తెలిసిన వోటు,
                              త్రినేత్రం!
  స్వచ్ఛంద వోటు,
                          అగ్నిహోత్రం!
  నిక్కచ్చి వోటు,
                     మంగళసూత్రం!
  వోటుగుట్టు,
           ఆయువుపట్టు,రామా!
4.అయిదేళ్ళకోసారి ఈ ఓటు!
  వినియోగాన చేస్తే పొరపాటు!
  మన బతుకు భంగపాటు!
 అయిదేళ్ల తప్పని రోకలిపోటు!
   వోటుగుట్టు,
           ఆయువుపట్టు, రామా!
           నాయకుడు
5.నాయకత్వానికి వేసే వోటు!
  ఇస్తుంది పాలనలో ఓ చోటు!
  నియంతవైతే తప్పదు వేటు!
  నేతగానిలిచావో మరలవోటు!
    వోటుగుట్టు,
           ఆయువుపట్టు, రామా!
6.అయిదేళ్ళఅధికారం నేతాజీ!
  నీతితో పడకు ఏనాడూ రాజీ!
  పడితే మరి ఇక నీవు మాజీ!
  నీ ఇంట నీకు నీవే  ఓ  ఖైదీ!
  వోటుగుట్టు,
          ఆయువుపట్టు, రామా!
_________


కామెంట్‌లు