వెండిషామియానా;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797
 బాల పంచపదులు
==============
1.నెలనెల వెన్నెల సోన!
   మంచి ముత్యాల వాన!
   చల్లని కిరణాల సేన!
   మంచి గంధాల సాన!
   ఆకాశాన,
       వెండిషామియానా,రామా!
2.వస్తువు-గుణం,
                      అవిభాజ్యం!
భూమి -క్షమ,నభం-విశాలం!
అగ్ని-దహనం,జలం-ప్రవాహం!
గాలి-ప్రసారం,పున్నమి-శీతలం!
ఆకాశాన,
     వెండిషామియానా, రామా!
3.వెన్నెల అమృతవర్షిణి!
   వెన్నెల ఆనందకారిణి!
   వెన్నెల ప్రేమస్వరూపిణి!
   వెన్నెల అశాంతిహారిణి!
   ఆకాశాన,
      వెండిషామియానా, రామా!
4.వెన్నెల ఆనందాల వెల్లువ!
    వెన్నెల విహారాల విలువ!
    వెన్నెల ఔషధుల  చలువ!
    వెన్నెల మనసులు కలువ!
    ఆకాశాన,
       వెండిషామియానా,రామా!
5.పున్నమి చంద్రుడు,
                        పోషకుడు!
   తారల చంద్రుడు,
                        మన్మథుడు!
  చవితి చంద్రుడు,
                        కళంకితుడు!
   చంద్రునిపై విజయుడు,
                       మానవుడు!
   ఆకాశాన,
      వెండిషామియానా, రామా!
6.వెన్నెల వెనీలా ఐస్ క్రీం!
   ముఖానికి పాండ్స్ క్రీం!
   కేకుపై పూసే తెల్లటి  క్రీం!
   లస్సీపై ఉండే చల్లటి ఫోం!
    ఆకాశాన,
     వెండిషామియానా, రామా!
_________


కామెంట్‌లు