జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
           1.కర్తవ్యం!
11.ఆలోచనలు గిలకరించు!
      విజ్ఞానం ఆవిష్కరించు!
      సమస్యలు పరిష్కరించు!
      జీవితం ఓ సవాలా!
12.నిరంతర శోధన!
      విరామం లేని సాధన!
     మరెక్కడ యాతన?
     జీవితం ఓ సవాలా!
13.సమస్య చర్చ ఎంతైనా!
     రచ్చ రొచ్చే మిగిలేది!
     అంతమయ్యే చర్య చేపట్టు!
     జీవితం ఓ సవాలా!
14. సుఖం ధనంతోనా!
       కష్టంతో సాధించు!
       తృప్తిగా అనుభవించు!
       జీవితం ఓ సవాలా!
15.చదువు "కొనకు"!
      చదువుకో, మేలుకో!
      మేలు చేయడం నేర్చుకో!
      జీవితం ఓ సవాలా!
_________
          (కొనసాగింపు)


కామెంట్‌లు