విజ్ఞానవాహకం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.-9441058797.
 బాల పంచపదులు
=============
1.యుక్త ఆహారం, విహారం!
   జీవితాంతం అవసరం!
   నూతిలో కప్ప అజ్జానం!
   జగతిలో గొప్ప సంచారం!విహారం ,
       విజ్ఞానవాహకం, రామా!
2.ప్రకృతి పరిశీలన అవకాశం!
   అనంత సౌందర్య ఉపాసనం!
   అవగతం సృష్టి నిర్మాణం!
   పడాలి దృష్టి క్షణం క్షణం!
    విహారం,
        విజ్ఞానవాహకం, రామా!
3.పర్యటన కుతూహలత!
   కన్నులకు సార్థకత!
   మనస్సుకు ప్రశాంతత!
   అవగాహన సానుకూలత!
  విహారం,
       విజ్ఞానవాహకం రామా!
4.పుట్టినగ్రామం,ఉన్ననగరం!
   సొంతరాష్ట్రం ,మాతృదేశం!
   సమస్తవిశ్వం నేడు కుగ్రామం!
   పర్యటనం నిజజ్జానవర్ధకం!
   విహారం,
          విజ్ఞానవాహకం,రామా!
5.మనభాషలు తెలుస్తాయి!
   మనసులు కలుస్తాయి!
  విశేషాలు ఉత్సాహమిస్తాయి!
 విహారాలు చేయాలనిపిస్తాయి!
    విహారం,
         విజ్ఞానవాహకం, రామా!
6."మేరా భారత్ మహాన్!"
   పర్యటించు బుద్ధివాన్!
   జ్ఞానం సేకరించు జ్ఞానవాన్!
   పరిణితి సాధించు కీర్తివాన్!
   విహారం,
        విజ్ఞానవాహకం, రామా!
________


కామెంట్‌లు