జీవితం ఓ సవాలా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.-9441059797.
       4.తత్త్వం!

49.జీవితం-నీ సంపాదనా!
    మరెందుకు -అంతవేదనా!
    పరమార్థం గ్రహించు!
    జీవితం ఓ సవాలా!

50."సమస్య" నీది!
      "సమాధానం" నీ నుంచే!
      "జీవితం -అవధానం",
                        సావధాన్!
      జీవితం ఓ సవాలా!

51.నీ ప్రమేయం,
                లేకుండా వచ్చావ్!
    నీ ప్రమేయం,
               లేకుండానే పోతావ్!
   మధ్యకాలం,
              మంచిగా గడిపేయ్!
   జీవితం ఓ సవాలా!

52. చిన్ళకణం-సజీవం!
       చిన్నబీజం- మహావృక్షం!
      పరమాణువు -బ్రహ్మాండం!
      జీవితం ఓ సవాలా!

53.స్థితి నుండి ఉన్నతస్థితి!
      జడత్వం నుండి చైతన్యం!
    శక్తిరూపాంతరంతో సాధ్యం!
       జీవితం ఓ సవాలా!
______'___
       (కొనసాగింపు)


కామెంట్‌లు