చైతన్య ఓ చైతన్య;-గుర్రాల. 9491387977.
చైతన్య ఓ చైతన్య మా చైతన్య
మన చెలిమిని మరిచిన చైతన్య
ఎందుకు నీకిక మధ్యలో మౌనం
ముందుకు పోదిక మా సహనం !

ఉలుకు లేదు పలుకు లేదు ఈమధ్య
గతంలోని పిలుపు లేక చెడిపోయెగా సయోధ్య
వచ్చిందిలే నీలో ఏదో ఒక మార్పు
అందుకే ఇవ్వలేక ఉన్నావులే తీర్పు 

మరి ఎలాగ ఉన్నావు నీవు చైతన్య
 గురి లేక ఏం చేస్తున్నావు చైతన్య
కవితలు మా భాగానే రాస్తున్నావు
కవి చెలిమిని  ముంచేస్తున్నావు !

చెప్పుడు మాటలు వినుకొని
తప్పుడు బాటలో నడుచుకుని
నువ్వు దూర భారమును పెంచావు
దవ్వున చెలిమికి తెరను దించావు!

నే ఫోనుల పెట్టిన మెసేజ్ లు
ఆవిరైపోయిన నమాజులు
ఎక్కడం లేదులే నీ చెవికి
 దిక్కెవ్వరు మరి ఈ కవికి !

నీలో ఉందిలే నవచైతన్యం
చాటి చెప్పు మా భవితవ్యం
చెలిమికి తెరుచుమ ద్వారం
కలివిడిగాచై ఈ వ్యవహారం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు