విశ్వంజీ మహారాజు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.94928 11322
 వీరగంధం వెంకట సుబ్బారావు గారు ఆంధ్రదేశంలో చక్కటి హరికథ  అందంగా చెప్పగలిగిన వారిలో ఒకరు  వారి స్వగ్రామం వినుకొండలో ప్రతి సంవత్సరం  వార్షికోత్సవం చేసి  విజ్ఞానులను పిలిచి  సన్మానం చేయడం ఆయన ఆచారం. ఆ రోజంతా హరికథ కార్యక్రమాలు సభలో ప్రధాన వక్తగా విశ్వంజీ మహారాజుగారు వచ్చారు. ఆయన నన్ను మాట్లాడమంటే  ఆధ్యాత్మిక స్థితి ఎక్కడో లేదు  మన శరీరాన్ని మించింది మరొకటి లేదు అన్నీ మన శరీరంలోనే ఉన్నాయి దానిని తెలుసుకుంటే చాలు నీ ప్రపంచాన్ని తెలుసుకోరా అంటారు పెద్దలు "ప్రా" అంటే అతి పెద్దదైన "పంచం" అంటే  పంచభూతాలతో ఏర్పడిన శరీరం  అని చెప్పిన తర్వాత స్వామీజీ చాలా ఆనందించి  మీకు ఏమైనా సందేహాలు ఉంటే  నా ఆశ్రమానికి వచ్చి తీర్చుకోండి చాలా చక్కగా చెప్పావు ఇంకా బాగా  పరిణతి రావాలి అని ఆశీర్వదించారు. 


కామెంట్‌లు