ఉత్తమ పురుషుడు;-ఏ.బి ఆనంద్ఆ-కాశవాణి,-విజయవాడ కేంద్రం.-9492811322
 కుటుంబ వ్యవస్థ భారత దేశంలో ఒకప్పుడు ఎంత మంది పిల్లలు ఉంటే అంత దండిగా ఆనందంగా  ఉన్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ చేయడానికి పని కూడా లేని దుస్థితి ఏర్పడిందని దేశంలో అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి  ఇందిరాగాంధీ సమాజానికి సంబంధించిన సంక్షేమమే కాదు కుటుంబానికి కావలసిన సంక్షేమం కూడా అవసరం  అని గ్రహించి కుటుంబంలో  ఇద్దరు లేక ముగ్గురు పిల్లల కన్న ఉండడానికి వీలు లేదని శాసించారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళని పంది పిల్లల్లాగా అభివర్ణించారు చాలామంది. పంది తన కుటుంబాన్ని పెంచుకోవడానికి  తాపత్రయపడుతోంది. మనిషి  తనలాగా జ్ఞానిగా ఒక్కడుంటే చాలు అని  కోరుకుంటాడు. దానిని దృష్టిలో పెట్టుకుని సంజయ గాంధీ  ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా బలవంతంగా కుటుంబ సంక్షేమాన్ని ప్రవేశపెట్టాడు. దానితో జనాభా అందరికీ పనులు ఉండి సంక్షేమంగా ఉందామనుకుని సంతోషపడ్డారు. రాశి వాసి అనే రెండు మాటలు ఉన్నాయి  సంఖ్య ఎక్కువ ఉంటే అది రాశి. తక్కువ ఉండి జ్ఞానంతో ఉంటే అది వాసి పందిని తెలివి తక్కువ జంతువుగా బురదలో పండుకునే అజ్ఞాన జంతువుగా అభివర్ణిస్తుంటారు. పండితులు. ఏనుగు ఒక్క బిడ్డనే కంటుంది అది ఎంతో తెలివైన జంతువు. అందుకే వేమన చెప్పిన పద్యం తెలివి తక్కువ దద్దమ్మలని 100 మందిని కనడం కన్నా, తెలివి కలిగిన వాడిని ఒక్కడిని,  గుణవంతుని కనడం వల్ల  ఆ కుటుంబానికి ఆ వంశానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెబుతున్నారు. 


కామెంట్‌లు