పవిత్రమైన మనసు వుండాలి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 ఇవాళ దేశంలో  పల్లెల నుంచి నగరాల వరకూ భక్తి పెరిగిపోయింది. భగవంతుని మీద విశ్వాసమో, భయమో ఎవరికీ తెలియదు  గ్రామదేవతల వద్దకు వెళ్ళినా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లినా జనం కిటకిటలాడుతూ ఉంటారు. దేవాలయాలలో చక్కగా  పూజలు చేయించి మొక్కుకుని  తీర్థప్రసాదాలు తీసుకొని వస్తారు. ఒక్క భగవంతుడు చాలడు  భారతదేశంలో ఉన్న  అన్ని దేవాలయాలకు వెళ్లి  గంగా నది నుంచి కృష్ణా నది వరకూ అన్ని నదులలో స్నానం చేసి నేను భగవంతుని చూశానని నాకు పాపాలన్నీ పోవాలని కోరుకుంటారు. దేవాలయాలలో వారు చూసిన   ఆ విగ్రహాల సౌందర్యం ఆ స్తపతి (శిల్పి) గొప్పతనం  పురోహితులు సక్రమంగా చేస్తున్నారా లేదా అన్న విషయం అన్ని విషయాల మీద దృష్టి పెడతారు తప్ప అసలు విషయం మీద దృష్టి ఉండాలి. ఎన్ని ప్రదేశాలు చూసినా వారి సాధించిందేమిటి ఏమీ లేదు.
నిజంగా భగవంతుణ్ణి చూడాలనుకుంటే  ఆయన ఏ దేవాలయాల్లోనూ కనిపించాడు. ముందు ఆత్మను  పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తన లోపల ఉన్న నేను 
అన్న శబ్దాన్ని చూడాలి. లో చూపు లేకుండా పోయింది అంటే  ఆత్మను గానీ పరమాత్మని కానీ జీవితంలో చూడలేరు. ఈ నగ్న సత్యాన్ని చెప్పటానికి వేమన ప్రయత్నం చేశాడు. కామెంట్‌లు