వి బి కనకదుర్గ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు దేశవిదేశాలలో తనప్రజ్ఞ ప్రదర్శించిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ప్రథమ శిష్యురాలు వి.బి కనకదుర్గ. వయోల, వయోలిన్ వాద్యాలు వారి వద్ద నేర్చుకుంది. ఆకాశవాణి  సంగీత శాఖలో ఆమెకు  వయోలిన్ కళాకారిణిగా  ఉద్యోగం వచ్చింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఓ రోజు నాటకంలో చిన్న వేషం చేయవలసి వస్తే దుర్గ (వి.బి కనక దుర్గ) ను అడిగితే  ఆ పాత్ర పోషించింది. ఆ రోజు నుంచి నాతో పాటు నేను నటించిన ప్రతి నాటకంలోనూ నాతో నటిస్తూ వచ్చింది. మాకు మంచి పేరు తెచ్చిన హర హర మహాదేవ  నాటకంలో అద్భుతంగా తన చాతుర్యాన్ని చూపించింది.  సంగీత విదుషీమణి కన్నా, నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఎవరికి ఏ సహాయం కావాలన్నా  లేదనకుండా చేసి పెడుతుంది  బాల మురళి గారికి సహ వయోలిన్  కళాకారిణిగా కూడా పేరు తెచ్చుకుంది. మంచితనానికి మారుపేరుగా  నిలిచింది. భౌతికంగా ఆమె దూరమైనా ఆకాశవాణి నాటకాల ద్వారా ఇంకా శ్రోతల హృదయాల్లో నిలిచే ఉంది  ఆవిడతో నాటకం చేయడం  అంటే చాలా ఆనందంగా ఉంటుంది.


కామెంట్‌లు