చైర్మన్ నాటకం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 డాక్టర్ రాజారావు గారు  నాటక రంగంలో ప్రసిద్ధులు  జమునను తన పుటిల్లు సినిమాతో పరిచయం చేసింది రాజా రావు గారే. ఆయన కొడాలి గోపాల్ రావు గారితో చైర్మన్ నాటకాన్ని  స్త్రీ పాత్రలు లేకుండా చేసి  వ్రాయించారు. ఆ నాటకంలో మొదట నేటి ప్రఖ్యాత సినీ నటులు కృష్ణ  నటించాడు. గుమ్మడి గారు చైర్మన్ గా వేశారు. కృష్ణ మద్రాస్ వెళ్లి పోయిన తర్వాత  రాజారావు గారి శిష్యులు కర్నాటి లక్ష్మీనరసయ్య గారు  ఆ నాటకాన్ని విజయవాడ తీసుకువచ్చి  ప్రధాన పాత్ర నాతో  చైర్మన్ పాత్ర డాక్టర్ వెంకట్ రాజు గారితో వేయించారు. డా. రాజు గారు మానిన తర్వాత సిని నటులు కె.వి.ఎస్ శర్మ గారు ఛైర్మన్ గా నటించారు.ఒక రోజున మాటల సందర్భంలో మీ కంఠం చాలా బాగుంది నా కంఠంలో జీర వుంది. శివాజీ గణేషన్ గారు నటించిన కట్టబ్రహ్మన సినిమాకు మీ వాయిసు సరిగ్గా సరిపోతుంది అని ప్రశంసించారు. తర్వాత రెండు నెలలకు నేను మద్రాసు వెళ్లి తేన్ మరై లో జెమిని గణేషన్ లకు డబ్బింగ్ చెప్పుతున్నప్పుడు శివాజీ గణేషన్ విని నా సినిమాకు శర్మ గారి కన్న మీరు డబ్బింగ్ చెప్పితే బాగుండేది అని అభినందించారు. హాస్య పాత్రల కోసం సినీ నటులు  నల్ల రామమూర్తి,  చదలవాడ కుటుంబరావులను తీసుకొచ్చాడు. కుటుంబరావు గారు  మా మామయ్య తో పాటు గన్నవరంలో చదివిన వాడు. అలా ఆయనతో నా బంధుత్వం కలిసింది. 100 పైగా  రంగస్థల వేదికలపై చైర్మన్ నాటకాన్ని ప్రదర్శించాము దాని ఛాయాచిత్రం.


కామెంట్‌లు