జన్మించిన వాడు మరణించక తప్పదు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ప్రతి జీవికీ మరణం అంటే ఏమిటో తెలుసు. "జాతస్యహి ధృవో మృత్యుః" అని గీతా వాక్యం. భూమి మీద పుట్టినా, నీటిలో పుట్టినా, ఎక్కడ పుట్టినా ఆయుష్షు తీరిన తరువాత చనిపోక తప్పదు.  యక్ష ప్రశ్నలప్పుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడుగుతాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. తాను రేపు మరణిస్తాడని తెలిసినా  బంధువులలోనో, స్నేహితులలోనో, తెలిసిన వారిలోనో ఎవరో ఒకరు చనిపోతే వెళ్ళి చూసి వస్తాం.  అయ్యో పాపం అని విచారిస్తాం. ఇంతకు మించిన వింత వార్త మరొకటి ఉంటుందా అని చెప్పాడు ధర్మ రాజు. ఈ ప్రపంచంలో ఉన్నవాడు కనపడాలి  వ్యాసమహర్షి వ్రాసిన వాక్యం శిరోధార్యమే. తాను నమ్మిన ఏ విషయాన్ని అయినా, న్యాయసమ్మతమైన ప్రతి విషయాన్ని ఆయన పుస్తకంలో గ్రంథస్తం చేశారు. కను మూస్తే మరణం కను తెరిస్తే జననం అని ఒక కవి రాశాడు. మరణానికి అర్థం " మ" అంటే  ప్రణాళికాబద్ధమైన అని, రణం అంటే మనం చేసే పని యుద్ధం  ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఏమేమి చేయాలో అవన్నీ సక్రమంగా చేయటం. అదే చావు అంటే తనువు నుంచి జీవి వేరు కావడం ప్రతి వాడికి తెలుసు. తనను కన్నవారు చనిపోతారని, తాను కన్నవారు చనిపోతారని తానూ చనిపోతానని తెలుసు అయినా ఏదో ఒక అపోహ.  దేవతల వలె కల్పాంతం జీవించి ఉంటాము అని సాధ్యమా అది? 

కామెంట్‌లు