ఉపాధ్యాయిని నిర్మల;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కృష్ణా జిల్లా ఉయ్యూరులో  ప్రతినెల మూడవ ఆదివారం సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. ఒక కార్యక్రమానికి  ఒక  మేధావిని పిలిచి వారితో  ప్రసంగం చేయించి  ఆ విషయాల మీద ప్రేక్షకులు  ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పేవారు. ప్రతి నెల ఒక అంశాన్ని గురించి కాకుండా  ఏ నెలకానెల ప్రత్యేక అంశాన్ని ఎన్నుకొని  దానిని గురించి చెప్పించేవాళ్లం. ఒక నెల  ప్రతినెల మగవారే అవుతున్నారు స్త్రీలలో కూడా  చెప్పగలిగిన వారిని ఎన్నుకొని  అంశాన్ని వారినే ఎన్నుకోమని  ఆహ్వానించే వాళ్ళం. ఒక నెలలో నిర్మల గారిని ఆహ్వానించి స్త్రీ గురించిన పూర్వాపరాలు చెప్పమంటే  స్త్రీ కి అర్థం చెప్పి ఆమె హక్కులు బాధ్యతల గురించి చాలా చక్కగా వివరించారు. స్త్రీ హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎందుకు వస్తోంది అన్న దానిని కూడా చక్కగా చెప్పారు. ఆ కార్యక్రమానికి గబ్బిట దుర్గా ప్రసాద్ గారు  ప్రత్యేక ఆహ్వానితుడిగా  వచ్చారు కోటేశ్వరరావు కూడా ప్రక్కన ఉన్నారు. ఆవిడ స్త్రీ అన్న అక్షరాన్ని విడదీసి  దానికి పూర్తి అర్థం చెప్పారు. స- ర- త- ఈ  అక్షరాల సమన్వయం స్త్రీ  సాత్వికం, రాజసం, తామసం  కలిపిన అవతారాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం చేసే ప్రయత్నం. ఈ అంటే ఏడుపు. ఏడుపు అంటే నిఘంటువు అర్థం ప్రయత్నము అని బాగా విశ్లేషించారు అధ్యక్షునిగా  ముగింపు ఉపన్యాసంలో ప్రతి స్త్రీ మాతృత్వం కోసమే పాటు పడుతుంది. మాతృత్వం  ఆమెకు వరం. అమ్మతనంలో ఉన్న  తృప్తి  కొన్ని కోట్ల ఆస్తులు కూడా రాదు  అయితే అమ్మ అర్థం తెలియని మనం ఆమెను మమ్మీ నీ చేశాం. అకార ద్వయంలో మకార ద్వయం (అ- మ- మ- అ) అ అంటే సృష్టి ఇది ఆదిలోనూ ఉంది అంతం లోనూ ఉంది ఇది స్రవంతి మధ్యలో ఉన్న మమ అంటే అహం (అహం బ్రహ్మాస్మి) అంటే అణువు-  జీవిని సృష్టించింది. ఆ తల్లికి ఎన్ని జన్మలు ఎత్తితే ఆమె రుణం తీర్చుకోగలం. అమ్మకు అమ్మ తప్ప మరొకరితో పోలిక లేదు అని చెప్పిన తర్వాత మా సభ్యులతో పాటు నిర్మల గారు కూడా అభినందించి నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నాను సర్ ఎంత గొప్ప విషయం చెప్పారు అండి అని కృతజ్ఞతలు చెప్పింది.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అధ్యక్ష స్థానంలో వున్న నన్ను అంతా కలిసి సన్మానించారు ఆ ఛాయ చిత్రం.


కామెంట్‌లు