లోచూపు;-ఏ. బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 చాలా మంది వ్యక్తులు భౌతిక సుఖాలను అనుభవించి,  వాటిపై మోజు తగ్గిన తరువాత ఇది కాక ఇంకా చేయవలసినది ఏమైనా ఉన్నదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి వేదాంతులను కలిసి వారి సలహాలు తీసుకొని పరలోక సుఖాల కోసం చేయవలసిన తపస్సు గురించి వివరాలను సేకరించి దానికి ఉపక్రమిస్తారు. భగవత్ స్వరూపాన్ని చూడాలని కలలు కంటాడు. దానిని చూడడానికి  అంకితభావంతో తపస్సమాధికి  వెళ్లిన వ్యక్తి  ఆ స్వరూపాన్ని చూసిన తర్వాత తనను తాను మర్చిపోతాడు. తాను చూసిన అత్యద్భుత దృశ్యాన్ని ఇతరులకు చెప్పుకోవడానికి ఈ లోకంలోకి వస్తే ఆయన్ని మర్చిపోతాడు. ఈ స్థితిని పట్టించుకోని వారిని ఎలా స్వాధీనం చేసుకోవాలి అని అన్వేషిస్తాడు. ముందు తనను తాను స్వాధీనపరచుకోవాలి మొదటి అడ్డంకి రంభ (నితంబం)- తొడ తరువాత ఊర్వశిని స్వాధీన పరచుకోవాలి ఊర్వశి అంటే కటి ప్రదేశం దానిని స్వాధీనం చేసుకున్న తరువాత మేనకను మేను అంటే శరీరం "క" అంటే ధరించింది ఈ శరీరం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి అప్పుడు తిలోత్తమ దర్శనమిస్తుంది  ఉత్తమ తిల (నువ్వు గింజ)ను   ఓంకారంగా చేసుకొని తన్మయత్వంతో శరీర భాగాలన్నింటిని వశ పరచుకొని ప్రత్యేకించి అరిషడ్  వర్గాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఆయన. తనలోని తను స్థితి పోతే తప్ప తనను తాను మరిచిపోయి ఆయనలో ఏకమై పోతాడు.ఇది వేమన గారి స్వీయ అనుభవం.కామెంట్‌లు