స్ఫూర్తి-అల్లూరి;-గుండాల నరేంద్రబాబు ;-సెల్: 9493235992.
పల్లవి:
జోహార్లు జోహార్లు సీతారామరాజా
మాహృదయాల్లో నిలచిన అసమాన తేజా
జోహార్లు జోహార్లు సీతారామరాజా
మాహృదయాల్లో నిలచిన అసమాన తేజా

చరణం:1
నిలువెల్లా నిష్కళంక దేశభక్తి  రేడా
వెల్లువలా పొంగిపొర్లే దైవభక్తి తోడా 
మాతృమూర్తికే తొలుత ప్రణమిల్లినవాడా
మాతృభూమి విముక్తికై ఉద్యమించినోడా

చరణం:2
అకుంఠితా దక్షుడైన ధీరాది ధీరుడా 
ఆదివాసీయులా ఆత్మీయ స్నేహితుడా
అణువణువున విప్లవాగ్ని దహించే   

వీరుడా
ఆంగ్లేయుల పక్కలో బల్లెమైన శూరుడా

చరణం:3 
మన్యం ప్రజ పౌరుషమై జ్వలించిన వీరా  
దైన్యం స్థానే ధైర్యమై నిలచిన ధీరా
గంటందొర మల్లుదొర అనుచర గణశూరా
వందేమాతర మంటూ నినదించిన సమర
చరణం:4
మరువం మేం ఎన్నటికీ మీత్యాగ నిరతిని
విడువం మేం ఎప్పటికీ మీ పోరు బాటని
  స్వాతంత్ర్య సమరంలో అమరం మీ చరితా
 సర్వకాలాలలో చెరగనిది మీ ఘనతా
================================

(నేడు 04.07.2022 ప్రముఖ స్వాతంత్ర్య సమారా యోధుడు  అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా)

కామెంట్‌లు