శ్రావణ మాసం;-జి.లింగేశ్వర శర్మ9603389441
శ్రావణమాసమువచ్చెను
పావనమైనట్టిముఖ్యపర్వమ్ములతో
దేవతల ప్రీతికరమై
దేవాలయములువెలుగునుదేదీప్యముగన్

వరముగనిమ్మనిగోరుచు
సిరిసంపదలెన్నొమాకు శ్రీకరముగనున్
కరములుమోడ్చియుపలికితి
సరగునరావమ్మనేడు శ్రావణ లక్ష్మీ!


కామెంట్‌లు