అన్నదానము;-జి.లింగేశ్వర శర్మ--9603389441
 🚩మత్తకోకిల
    అన్నిదానము లందు నెంతయొ అన్నదానమె చూడగన్
     మిన్నయౌ నని సన్నుతింతురు మేదినిన్, జనులెల్లరున్
      కొన్ని దానము లెంత జేసిన, కోరు కొందురు మక్కువన్
       తిన్న తిండికి మాత్రమే, కడు తృప్తి పొందుదు రీభువిన్
🚩కంద పద్యము:
    ఏకైక దానము నిదియె
     లోకములో తృప్తిజెంది లోకులు నింకన్,
    ఆకలి దీరిన వెంటనె
      మాకిక చాలనుచు జెప్పు మహిమను గలదే!!
🚩కందపద్యము
    హే కాశీపుర వాసిని!
    ఆకలి బాధలను దీర్చి నాహారముకున్
     ఏ కొరతను లేకుండను
      నీ కరుణను జూపు మమ్మ! నిరతము మాపై!!

కామెంట్‌లు