పట్టుదల పోటీతత్వం;-జి.లింగేశ్వర శర్మ9603389441సిద్దిపేట
1.పట్టుదలతోడనొక్కో
మెట్టునుదాటుచునుకష్టమెదురొచ్చినయున్
పట్టునువీడకముందుకు
గట్టిగసాగాలినీవుగమ్యముజేరన్

2.లేకున్ననుపట్టుదలయె
నీకికరాదేదినింకనిశ్చయముగనున్
సాకారమవ్వదుగకల
లోకమునందుననునెన్నిరోజులకైనన్


3.పెట్టియి శ్రద్దనుమిక్కిలి
పట్టుదలగసాగిమీరు ప్రగతినిపొందన్
నెట్టిపరిస్థితిలోనను
పట్టినపట్టునవదలకపదముందుకికన్

4.పోటీతత్వంతోడను
సాటిగముందుకుకదిలినచదువులయందున్
బాటలువేయునుభవితకు
మేటిగరాణించిమీకుమేదినియందున్


కామెంట్‌లు