విశ్వశాంతి;-జి.లింగేశ్వర శర్మ--9603389441
నీకున్ మ్రొక్కెద దేవా
గైకొనిమాపూజలన్నిగాపాడుమికన్
లోకమునంతయుశాంతిని
చేకూర్చియు శ్రీనివాస శ్రితజనపోషా

కలహములేవియులేకను
చెలిమినిగోరుచుసతతముచేతులుకలిపిన్
నిలవాలిశాంతిసౌఖ్యము
లిలలోననిగోరచుండిరేదేవానిన్

ఇష్టములన్నియుదీర్చుచు
సృష్టినయంతటనునీవె క్షేమమొసగుచున్
దృష్టినినిల్పియుసతతము
కష్టమురాకుండమమ్ముగావుముదేవా!

క్షామములేవియులేకన్
క్షేమముగానుంచుమనుచు క్షితినంతయునీ
నామముదలంచుచుసదా
స్వామీగోరెదముమేముసర్వేశ్వరుడా


కామెంట్‌లు