చదరంగం లో వైభవ్’ ప్రతిభ ;-మణినాథ్ కోపల్లె 9703044410


  “ఏకాగ్ర చెస్ అకాడమీ” వారు చెస్ తెలంగాణా   / AICF (ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్) వారి సహకారంతో  కలిసి ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  ఛెస్ పోటీలలో భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి (నలుగురు) కూడా వచ్చి పాల్గొన్నారు. నగరం లోని శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంం యూసుఫ్ గూడా లో జరిగాయి. ఆరు సంవత్సరాల చిన్నారి నుంచి 88  ఏళ్ళ వరకు  500 మంది పైగా పాల్గొన్నారు. 
వారిలో డిఫెరెంట్లీ ఏబల్డ్   చైల్డ్  ‘వైభవ్’  వయసు 22 సంవత్సరాలు. ఢిల్లీ నుంచి వచ్చి  చదరంగ పోటీలల్లో పాల్గొన్నాడు. ప్రతిపనికీ తల్లి తండ్రి మీద ఆధారపడే వైభవ్  కి ఈ చదరంగం అటపై చాలా ఆసక్తి వుంది. ఆట ఆడేటప్పుడు తండ్రి సహాయం తీసుకుంటాదు. . . ఈ పోటీల్లో  ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు.  ఈ పోటీల్లో 5/9 పాయింట్స్ సాధించాడు. ప్రత్యేక బహుమతిని అందుకున్నాడు. 
వైభవ్ తల్లి అతని గురించి మాట్లాడుతూ మనం చెప్పేది అంతా అర్ధం చేసుకుంటాడనీ, జ్ఞాపక శక్తి అపారం అనీ అన్నారు. ఉషా, మనోజ్ ల కుమారుడు, వాళ్ళకి డిల్లీ లో స్కూల్ యూనిఫారంస్ బట్టల దుకాణం ఉందని అన్నారు. వైభవ్ కి ఇద్దరు చెల్లెళ్ళు వున్నారు. ఉష మాట్లాడుతూ వైభవ్ కి అన్నీ సమకూర్చటం అంటేనే ఇష్టం అనీ, బయటికి వేరే ఇంకెక్కడికీ వెళ్ళటం ఇష్టం వుండదనీ, వైభవ్ కి సేవ చేయటం భగంతుని సేవగా భావిస్తాననీ అన్నారు. వైభవ్ కి
 ప్రముఖ  చెస్ క్రీడాకారులతో వాట్స్ అప్ ద్వారా పరిచయాలు వున్నాయని. అందరికీ హాయ్ చెబుతుంటాడనీ, చెస్ బేస్ ఇండియా  ద్వారానె ఈ పోటీలలో పాల్గొన్నాడనీ ఉష (వైభవ్ తల్లి)  చెప్పారు.  చదరంగం ఆట పై ఎంతమంది ఆసక్తి చూపుతున్నారో, ఎంతలా అభివృద్ధి చెందుతోందో  ఈ టోర్నమెంట్ చూస్తే తెలుస్తుంది. 

 

కామెంట్‌లు