అల్లూరిసీతారామరాజు జీవితచరితతేది;--డా. భరద్వాజరావినూతల 9866203795

 ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
******** 
4️⃣6️⃣1️⃣)
తెళ్ళోళ్ళగుండెల్లో వణుకు
పుట్టించిన ఘనుడు అల్లూరి
స్వాతంత్రోద్యమానికి పోశాడు ఊపిరి
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
******** 
4️⃣6️⃣2️⃣)
మన్యం ప్రజలకు దేముడు
వారికై పోరాడిన యోధుడు
ఎదిరించాడు ఆంగ్లేయుల ఆగడాలను
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣6️⃣3️⃣)
 బానిసత్వం పై చేశాడు తిరుగుబాటు
సాయుధపోరాటానికి‌నిలువెత్తు రూపం
గిరిజన బ్రతుకుల సరిదిద్దే ప్రయత్నం
 చూడచక్కని తెలుగ సున్నితంబు .---!
******** 
4️⃣6️⃣4️⃣)
 నడిచాడు సిద్ధాంతపు‌బాట
ఎదురించాడు తెల్లవాడి తూటా
వందేమాతరమంటూ వదిలాడు ప్రాణం
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********  
4️⃣6️⃣5️⃣)
 తెలుగునేలన మన్నెం వీరుడు
దేశభక్తి నింపుకున్న వీరుడు
స్వరాజ్య స్థాపనలో బాశాడు అశువులు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
కామెంట్‌లు