చాతుర్మాస వ్రతము; -"శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 🙏చాతుర్మాస వ్రతము
 
    నియమాల తోరణము
    పాటించాలి మనము!
            ఆత్మ బంధువు లార!
           ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
 👌వ్రతములలో విశిష్ట మైనదీ.. "చాతుర్మాస వ్రతము!" ఇది.. నియమాల తోరణము! దీనిని భక్త మహాశయు లందరు నాలుగు నెలలు.. భక్తి ప్రపత్తులతో; తమ ఇష్టదైవమును ఆరాధిస్తారు!
👌 శ్రీ మహావిష్ణువు "ఆషాఢ శుద్ధ ఏకాదశి" నాడు శేషశయ్యపై నిదురకు ఉపక్రమిస్తాడు. దీనిని "శయన ఏకాదశి" అంటారు! తిరిగి "కార్తీక శుద్ధ ఏకాదశి" నాడు మేలుకొంటాడు. దీనిని "ఉత్థాన ఏకాదశి" అంటారు! ఈ నాలుగు మాసముల కాలమును "చాతుర్మాస వ్రత దీక్ష"గా, ఆరాధకులు, సాధకులు, పరివ్రాజకులు, జీయర్లు... పాటిస్తారు
👌ఈ వ్రతము.. వ్యాధి నివారకము. దీనిని ఆచరించడం వలన, పరమేశ్వరుడు; ఇహంలో. సుఖములను; పరంలో.. మోక్షమును; సాధకులందరికీ ప్రసాదించు చున్నాడు! 
       ఈ నాలుగు నెలలలో..  ఎన్నో పండుగలు, పర్వదినములు వస్తాయి! అవి, "గురు పౌర్ణమి, మంగళ గౌరీవ్రతం, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వ్రతo, మహాలయ పక్షాలు, శ్రీదుర్గాదేవి నవరాత్రులు ( శరన్నవరాత్రులు,) కార్తీక స్నానాలు, శివారాధనలు".. ఇలా ఏర్పాటు చేసారు, మన మహర్షులు
⚜️కంద పద్యము⚜️
     చాతుర్మాస్య వ్రతమ్మది
     ప్రాతః స్మరణీయ మైన ఫలితము లిడునౌ
      ఏతీరుగ పూజించిన 
      ఆతీరుగ విశ్వనాథు డరయుచు నుండున్!
       ( డా. శాస్త్రుల రఘుపతి.,)

కామెంట్‌లు