భక్తి మార్గము;- "శంకరప్రియ.," శీల.,;-సంచారవాణి: 99127 67098
 🙏భక్తి మార్గము నందు
     భాగవతు లందరికి
     ముక్తి పదమును కలుగు!
            *ఆత్మ బంధువు లార!!*
           ( ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.,)
👌"భక్తి" అనగా భజించుట! పరమేశ్వరుని త్రికరణ  శుద్ధిగా సేవించుట! ఇది.. శ్రీకైవల్య పదమగు మోక్షమును కలిగించు వాటిలో.. సర్వోత్తమ మైనది! ఇది.. తొమ్మిది విధములు! అవి.. శ్రవణము(1), కీర్తనము(2), స్మరణము(3), పాదసేవనము(4), అర్చనము(5), వందనము(6), దాస్యము(7), సఖ్యము(8), ఆత్మ నివేదనము(9).. అనునవి; "ముక్తిపదము"ను చేర్చు.. "నవవిధ భక్తి" మార్గములు!
 
👌భక్తి ప్రపత్తులతో.. పరమేశ్వరునకు అభిషేకించిన శుద్ధోదకము, కొబ్బరునీరు, పంచామృతములు.. మున్నగు నవి; భక్త మహాశయులకు.. దివ్యతీర్ధము లగును! అట్లే, భగవంతునకు సమర్పించిన పత్రము, పుష్పము, ఫలములు, ..మహా ప్రసాదము లగును.
 👌చతు ర్విధములైన భక్తు లందరూ, భక్తి మార్గము ద్వారా.. సుఖశాంతులను, మరియు, 
ముక్తి పదమును పొందు చున్నారు!
 ⚜️సీస పద్యము⚜️
    భక్తి భావము జేర, పాత్రలో నీరమ్ము 
      దివ్యత్వ మొనగూడి, తీర్థ మగును
       భక్తి భావము జేర, పళ్లెమందున భుక్త 
       వైదిక ధర్మ ప్రసాద మగును!
       భక్తి భావము జేర, ప్రజలు పాడెడి పాట
       పరమాత్ము నర్చించు భజన యగును!
       భక్తి భావము జేర, పరగు ప్రయాణమ్ము
      శ్రోత్రియుల్ సాగించు యాత్ర యగును!
        ( తేట గీతి )
        భక్తి భావము జేరుచో, ప్రజలు పూని
       చేయు పను లెల్ల  పరమాత్మ సేవ లగును!
        భక్తి భావము జేరుచో, బ్రతుకు లెల్ల
         అతి పవిత్రమై మోక్షమ్ము నంద గలవు!
( రచన: డా. ఆచార్య ఫణీంద్ర., )

కామెంట్‌లు