మద్యపాన ప్రియులు"శంకరప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌మద్యపాన ప్రియులు
   
వ్యవహరిస్తా రెపుడు
     అయిదు లక్షణములుగ
 ఆత్మ బంధువులార!
      (ఆత్మ బంధు పదాలు., శంకరప్రియ.,)
👌మత్తును కలిగించే మద్యమును; సేవించు వారే.. మద్యపాన ప్రియులు! వారిని "త్రాగు బోతు"లని, వ్యవహరిస్తారు, ప్రజలందరు!
👌మొదటి సారి... "చిలుకల వలె పలుకులు" పలుకుతారు.
     రెండవసారి... "కోయిల వలె పాటలు" పాడుతారు.  
    మూడవసారి...  "కొంగ వలె జపము" చేస్తునట్లు, కనబడుతారు!
       నాలుగవ సారి...
"కర్ణునిలా దానము" చేస్తున్నట్లు, ప్రగల్భాలు చేస్తారు!
      ఆఖరున, ఐదవ సారి... కుంభకర్ణునిలా, గుర్రుపెట్టి నిద్ర పోతారు!
    ...ఈ విధంగా త్రాగుబోతుల యొక్క వాలకములను, అయిదు విధములుగా ఉంటాయి!
⚜️తేటగీతి పద్యము⚜️
     తత్తడి చిలుక పల్కులు త్రాగి తొలుత,
     కోయిలల్లె పాటలు మలిగుక్కఁ గొనగ,
      మూడవతఱి కొంగ యటుల బోడిజపము
       తుఱిమి, నాల్గున కర్ణుడై తుళ్ళుచుండు
       కుంభకర్ణు డట్లు తుదకు గుఱ్ఱుఁ బెట్టు;
      పంచకముగ త్రాగుజనుల వాలకములు.
    (రచన: అయ్యగారి. కోదండ రావు.,)

కామెంట్‌లు