పోగాలం గాబట్టే!!!; - ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
యాకాశి పండుగొచ్చే
బక్రీద్ పండుగొచ్చే
ఊర్లు బస్తీ లన్నీ
జనం తో నిండిపోయే

మనుషుల్లో సంబరం నిండుకునే 

బట్టల దుకాండ్లు 
మ్యాకల అమ్మకాలు
ఎక్కువైపోయే
భక్తితో దేవుని గుళ్ళు 
నిండిపోయే

వ్యాపారానికి రెక్కలోచ్చి ఎగురావట్టే 


వానలేక్కువయ్యే
వరదలు నిండిపోయే
ప్రమాదాలకు రోగాలకు
లెక్కలేకుండ ఐపోయే

ఆసుపత్రుల బెడ్లు కరువైపోవాట్టే 


మనుషుల బంధాలు
పెరుగుతూంటే 
ఆది సహించలేక
కరోనా తన ఆకారాన్ని
పెంచబట్టే.......................

అటు సావాల్నో బతకాల్నో
తెలియకుండా జేయబట్టే
ఈ మాయదారి కాలం
ఏమిటో...... గిట్ల కాలం పోగాలం గా బట్టే!!?
🌹🌹🌹

కామెంట్‌లు