జలకళ ; - ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
కుండపోత వర్షంతో
నిండుతున్నాయి చెర్వులు
పొంగుతున్నాయి వాగులు
పారుతున్నాయ్ వరదలై

జలకళ ఉట్టిపడుతుంది
జలధార మెరిసిపడుతుంది
జలశక్తి విజ్రుంభిస్తుంది
జలపాతం ఊరకలేస్తుంది

నీరు నిండుతుంది
నేల తడుస్తుంది
చేను పచ్చబడుతుంది
పూలు వికసిస్తున్నాయ్


వాన కురుస్తుంది
ఇంద్రధనుస్సు మెరుస్తుంది
నింగి నేల ఒకటై
మంచు తెర కప్పుకుంది


మబ్బులు వర్షిస్తున్నాయ్
పుడమి పులకరిస్తుంది 
మనసు పరవశిస్తుంది
తనువు నాట్యమాడుతుంది

వర్షాల జోరు
గంగమ్మ పరుగు
అవని ఆనందం
ఈ లోకానికి కావాలి
నిత్య వసంతోదయం
🌹🌹🌹

కామెంట్‌లు