పిలుస్తే వస్తా!!?;-ప్రభాకర్ రావు గుండవరం-ఫోన్ నం.9949267638
నేను వెళ్ళాననీ
మళ్ళీ రాననీ
అనుకోకండీ

ఆశ్రద్ద నిర్లక్ష్యం
ఇంటి చుట్టూ 
అపరిశుభ్రత
వాతావరణం 
ఆరు బయట
ఆహారం తినడం

సమూహం లో
మాస్క్ లేకుండా
తిరగడం దూరం
ఉండడం మర్వడం

షానిటైజర్ సబ్బులు
వాడకం తగ్గించడం
అవసరం వేళలో 
గ్లౌజలు ధరించక పోవడం 

నా రాకను మీరు
ఆహ్వానం చేయడమే
నాకు మీరు మనస్సు
నిండా స్వాగతం
పలుకడమే  గుర్తుంచుకోండి

నేను ఎక్కడో లేను
మీరు పాటిస్తే నేను ఎక్కడా ఉండను
ఇట్లు
కరోనా ది గ్రేట్

కామెంట్‌లు