బోనాల పండుగ ఒగ్గు కథ ; - ప్రభాకర్ రావు గుండవరం-ఫోన్ నం.9949267638
ఆషాడ మాసమొచ్చే
బోనాల పండుగొచ్చే
ఊరంతా ఉత్సాహంగా ఆనందం తో తెలియాడే

ఊరు ఊరు బస్తీ బస్తీ
సంబరాలతో నిండిపోయే
ఏడుగుళ్ల దుర్గమ్మకు పట్టం గట్టే వేళాయే

పోతురాజు గంతులోచ్చే
సీగాలూగే సమయాలోచ్చే
అమ్మవాళ్లకు నైవేద్యం పెట్టి ఊరేగింపు సేసే పొద్దే వచ్చే

గోల్కొండ... మహంకాళి... దండాలు
ఉజ్జయిని.... మహంకాళమ్మా దండాలు............హై 
దండాల్ దండాల్ తల్లీ దండాలు
లస్కర్.....బోనాల తల్లీ దండాలు... హై..... దండాల్ దండాల్ తల్లీ దండాలు 

నల్లపోచమ్మనీకు....... దండాలు
బవురం పేట మైసమ్మా..... దండాలు

సిన్నబోకు మాయమ్మ సూరారం మైసమ్మ
గాజులు పెట్టి దండం బెడ్తా
గాజుల రామారం తల్లీ
ఆలుగబోకే మా తల్లీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లీ
ఈ ఎడాది మీ జాతర సక్కంగా అవుతుందే మా తల్లీ 
అందర్నీ సల్లంగా సూడవే.....ఓ యమ్మ...... దయతో కాపాడే  తల్లీ మా యమ్మా...........

కరోనా రాకుండా సూడు
కల్లోలం కాకుండా సూడు
పాడి పంటలతో దేశం వర్ధిల్లేలా సూడవే తల్లీ
లోకం లో అందరికి ఆరోగ్యం కల్పించు తల్లీ
🌹🌹🌹

కామెంట్‌లు