పిల్లలం మేం పిల్లలం
ఎంతో మంచి పిల్లలం
కల్లా కపటం తెలియని వాళ్ళం
పాపం పుణ్యం ఎరుగని వాళ్ళం
ఈర్ష్య ద్వేషం లేని పిల్లలం
ఆటలు మాకే స్ఫూర్తిదాయకం
పాటలు పాడుతూ ఆడేస్తాం
అందరితోటి కల్సిఉంటాం
ఎవరు చెప్పిన అట్టే వింటాం
ఏదైనా మేం చేసేస్తాం
చెట్లు కొమ్మలు ఎక్కేస్తాం
కొండలు కోనలు తిరిగేస్తాం
అమ్మా నాన్న అడుగు జాడలో
మాస్టారు చెప్పిన క్రమశిక్షణ తో
విద్యలు బాగా నేర్సెస్తాం
ఈ దేశానికి సేవ చేసేస్తాం
🌹🌹🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి