కొండంత స్ఫూర్తి కొమురన్న;-- దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట 9959007914
 కట్టు బానిసల కళ్ళు తెరిపించిన
చైతన్య  వీరుడివి నువ్వు
నియంతల గుండెల్లో మంట పెట్టిన
నిప్పు కణికవి నువ్వు
సాయుధపోరాటానికి సమిధ వైన 
అమర సైనికుడివి నువ్వు
భూస్వామ్య నిరంకుశత్వానికి బలైన
త్యాగధనుడివి నువ్వు
అచేతనమైన తెలంగాణ జనావళి కి
కొండంత స్ఫూర్తి ని రగిలించిన 
ఉద్యమ కెరటం నువ్వు 
పాలకుల  తుపాకీ గుండెను ముద్దాడిన
కడవెండి యోధుడివి నువ్వు
మాతృభూమి  స్వేచ్ఛ స్వరాజ్యం కోసం 
ప్రాణాలనే తృణపాయంగా ఇచ్చిన
ఓ కొమురన్న ! 
నువ్వు రగిలించిన పౌరుషమే 
నేటి ఈ స్వరాజ్య మదురఫలం.

=======================
( నేడు తెలంగాణ ఉద్యమ తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా.)

కామెంట్‌లు