త్యాగమూర్తి అమ్మ;--గద్వాల సోమన్న ,-గణితోపాధ్యాయుడు,-ఎమ్మిగనూరు,-సెల్:9966414580.
త్యాగానికి ప్రతిరూపము
తల్లి ఇంట అసమానము
భగవంతుని బహుమానము
భారతితో సమానము

అబ్బురమే అనురాగము
అంబరమే ఆమె గుణము
అవనియంత సాత్వికము
అసలైన ఆణిముత్యము

అమ్మ ఇంట మణిదీపము
దైవానికి సాదృశము
ఆమె ఉన్న శాంతివనము
తరిగిపోని మూలధనము

కన్నవారిని పూజించుము
కరుణ కాస్త చూపించుము
వారి ఋణము తీర్చుకొనుము
అవసానాన  చూచుకొనుము


కామెంట్‌లు