రాష్ట్రపతి పీఠంపై ద్రౌపది ముర్ము ;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
ప్రథమ పీఠంపై
వెలసెను గిరి పుత్రిక
భారతి మోముపై
విరిసెను నగు మల్లిక

మన దేశ చరిత్రలో
అరుదైన ఘట్టమిది
ప్రజాస్వామ్యానికి
నిలువెత్తు సాక్ష్యమిది

ఆదివాసుల వనమున
వికసించిన కమలం
"ద్రౌపది ముర్ము "గారి
జీవితమే విమలం

మన సంస్కృతి గొప్పది
స్త్రీలకు గౌరవమిది
ఘన చరిత్ర మనది
ప్రబల నిదర్శనమిది


కామెంట్‌లు