" బలపం ";--గద్వాల సోమన్న ,-ఎమ్మిగనూరు,-సెల్:9966414580.
బలపం  బలపం బలపం
నాన్న తెచ్చిన బలపం
నిత్యం నాతో ఉండే
నేను మెచ్చిన బలపం

బలపం రంగు  తెలుపు
అక్షర మాలను కలుపు
ముద్దులొలుకే బలపం
సున్నపురాయి రూపం

బలపం వ్రాత సాధనము
సాయపడును ప్రతిదినము
అక్షరాలు దిద్దుటకు
బాలలకూ  అవసరము
 
పలక,బలపం మిత్రులు
చేయును గొప్ప మేలులు
బడిలో త్యాగమూర్తులు
మదిలో  తీపి గుర్తులు


కామెంట్‌లు