సర్కారు బడి;- --గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు,సెల్:9966414580.
మన సర్కారు బడి
నేర్పుతుంది నడవడి
తరుముతుంది అలజడి
దిద్దుతుంది బ్రతుకు బడి

మన సర్కారు బడి
సంతోషాల సవ్వడి
నాడు -నేడు  పనులతో 
సత్ఫలితాల దిగుబడి

వ్రాయుటకు పుస్తకాలు
చదువుటకూ పుస్తకాలు
చిక్కీలు,కోడి గ్రుడ్లు
ఇస్తారోయి! బ్యాగులు

క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు
అధునాతన సౌకర్యాలు
పంచుతుంది విజ్ఞానం
పెంచుతుంది వికాసం

రండీ! సర్కారు బడికి
మన చదువులమ్మ గుడికి
ఆనందమే మది మదికి
తిరుగులేదోయ్! చదువుకి

అందుకోండి ఆహ్వానం
చేసుకోండి తీర్మానం
మన సర్కారు బడిని
బలోపేతం చేదాం!!


కామెంట్‌లు