చెమక్కులు! సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆరోజుల్లో రష్యాలో పెద్ద పెద్ద రంగుల చిత్రాలు గీసేవారు. లెనిన్ గ్రాడ్ కి చెందిన చిత్రకారుడు పికాసోని కలిశాడు.వారి సంభాషణ ఇలాసాగింది"మీదేశంలో రంగులు(కలర్స్)అమ్ముతారా"లెనిన్ ప్రశ్న! "ఓ!ఎక్కడ పడ్తే అక్కడ!" "ఎలా!ఏరూపంలో?"
"ట్యూబుల్లో!" "వాటిపై ఏంరాసిఉంటుంది?" "రంగుల పేర్లు!!ఇంకేం రాస్తారు?" విసుగ్గా  అన్నాడు ఆయువకుడు."ఆట్యూబ్ లపై ఎరుపు పసుపు నీలం..ఇలా!"
పికాసో సలహాచూడండి"మీఫ్యాక్టరీలో  ఇలా వేర్వేరు రంగులు తయారు చేసే బదులు ఒకే ఒక  పదంని ఆట్యూబ్ పై రాస్తే సరిపోతుంది. ఉదాహరణకు "మొహం రంగు..ఎరుపు! జుట్టు రంగు!సైన్యం యూనిఫాం రంగు!" పికాసో భావంలో మనుషుల మొహాలు తీరుతెన్నులు వేర్వేరు!కానీ ఎరుపు వాడితే సరిపోతుంది. అంటే సైన్యంలో వారి చిత్రాలకి మొహాలతో పనిలేదు. జుట్టు నలుపు సైనిక యూనిఫాం రంగుతో ఒకే ట్యూబ్ తో సరిపెట్టవచ్చు.కానీ పాపం ఆయువకుడు అర్ధం కాక తికమక పడ్డాడు అన్నది నిజం!
పికాసోని  కలవాలి అని ఓమిత్రుడు వచ్చి "నేను అర్జంటుగా అమెరికా వెళ్లాలి.చేతిలో తగినంత డబ్బు లేదు "అన్నాడు. వెంటనే పికాసో కింద పడున్న ఇనుప తీగను తీసుకుని రకరకాలుగా వంచి ఓ ఆకారంలో మలిచి"ఇది తీసుకుని వెళ్లి పికాసో చేసిన  కళాకృతి అని చెప్పు.వెంటనే నీకు కావల్సినంత డబ్బు చేతిలో పడుతుంది. "తనపై తనకెంతో నమ్మకం ఆత్మవిశ్వాసం పికాసోకి! ఆవ్యక్తి అలాగే ఆసూచన పాటించి ఎంచక్కా  అమెరికా వెళ్లాడు.
ఒకసారి పికాసో మోడర్న్ ఆర్ట్ కి సంబంధించి వన్ మ్యాన్ షో ఏర్పాటు చేశాడు.ఎవరో కొన్ని చిత్రాలు దొంగిలించారు.పోలీసులు దొంగను పట్టుకోలేక చేతులెత్తేశారు. "మిష్టర్ పికాసో! మీరు దొంగను గుర్తించే చిత్రాలు గీస్తే మేము పట్టుకోగలం!" సరేనంటూ పికాసో గీసిన బొమ్మలు ఇవి-రెండు గుర్రాలు ఒక పిల్లి! పాపం పోలీసులు తలలు బద్దలుకొట్టుకున్నారు!?
రోమ్ లో ఓప్రసిద్ధ చిత్రకారుడు చౌరస్తా లో తను చక్కగా గీసిన చిత్రం ని పెట్టి "కళావిమర్శకులు చిత్రంలోని లోపాలను ఎత్తి చూపుతూ అక్కడ చుక్క పెట్టండి"అని ఓఅట్టపై రాసి వేలాడదీశాడు.ఇంకేముంది!చుక్కల తో చిత్రం నిండి పోయింది ఆకాశంలో తారకలాగా! నిరాశతో అతను ఈనోట్ పెట్టాడు " చిత్రంలో లోపం ఉన్న చోటమీరు సరిచేసి ఇంకో చిత్రం గీసి ఇక్కడ తగిలించితే నాకు ఉపయోగం!" అంతే! ఏఒక్కరూ ఆపని చేయలేదు. తప్పులెన్నువారు తమతప్పులెరుగరు కదూ?🌷

కామెంట్‌లు