విశ్వామిత్రులు!!?; -- ప్రతాప్ కౌటిళ్యా
గుండెల్ని పగలగొట్టి
గోడల్ని కూలుస్తున్న
మనుషుల్ని చూస్తున్నాం!!?

ఇంటిని ఖండాల్ని చేసిన గోడల్ని
కూల్చేసే సమయం కోసం
కాలం లక్షణాల్ని పరిశీలిస్తుంది!!

దీపార్చనలలో లక్షలదీపాల్ని ఆర్పి
ఒక్క అఖండ దీపాన్ని వెలిగిస్తున్న
ఆకాశాల్ని ఆహ్వానిస్తున్నాం!!?

కొవ్వొత్తులై వెలుగుతున్న దిక్కులు వేరు
కొవ్వొత్తులై కరుగుతున్న మనుషులు వేరు

తలుపుల్ని తెరిచి సూర్యోదయాన్ని
ప్రతి ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే
ఇల్లన్నీ దేవుని గుల్లవుతున్నాయని
ఆ ఇంటి ఇల్లాలు వేల ఏళ్లుగా బండరాళ్లను
దేవుళ్లను చేసే పనితో అలసిపోతూనే ఉంది!

నీటిలో కరగాల్సిందే ఏదైనా
కరిగిపోవాల్సిందే లేకుంటే
కొలిమిలో పోసి కరిగించాల్సి వస్తుందని
తెలుసు

మనుషులను కరిగించి పోసే
మూసల్నీ తయారుచేసిన
పవిత్రమైన పనిలో నిమగ్నమైన
మనుషులు అంతా
ఎంత కఠినమైన కరిగిపోవాల్సిందే
అని తెలుసుకుంటే చాలు!

రంగు రుచి వాసన లేని స్వచ్ఛమైన
స్పటికం పట్టకంగా మారే ప్రయాణంలో
రంగులన్నీ ఒకటైపోవాల్సిందే!?

భయం బ్రాంతి అనే బంతిని ఆకర్షించే
భూమిని మించిన మనస్తత్వం ముందు
శత్రుత్వం ఓడిపోవాల్సిందే!!?

కళ్ళ నదులు రెండు తనువు
సాగరంలో కలిస్తే
అణువు అణువు చలనచిత్రమైనట్లు
కనుగొంటాం!!?

నిర్వీకార మంత్రం ఒకటి ఆకారం ఇచ్చింది
శబ్దం చిత్రం లా ఆడ మగాల రూపం
విశ్వరూపంగా మారింది!!?
ఒకరికొకరు శత్రువులు కాదు
విశ్వామిత్రులు వారు!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
8309529273

కామెంట్‌లు