ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ ; -వెంకట్ మొలక ప్రతినిధి


 వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్   👉దైవభక్తి కన్నా దేశభక్తి గొప్పది: మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి జూలై 26 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి వీర జవానులకుస్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు పాఠశాల వెల్ విషర్ సోషల్ వర్కర్ వెంకట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్గిల్ డే నిర్వహణలో భాగంగా ఈరోజు గురుకుల బాలికల పాఠశాలలో జాతీయ జెండాని ప్రదర్శిస్తూ ఆర్మీ వేషధారణలో  ఆర్మీ పడి కష్టాలను కళ్ళకు కట్టినట్లుగా స్టూడెంట్స్ ప్రదర్శించారు విద్యార్థులు కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకొని అమరులైనటువంటి వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండి దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని గురుకుల పాఠశాల విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత  ఎదగాలని దేశ రక్షణ కోసం ఎందరో సైనికులు విరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర సైనికులకు వందనం అన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ వెంకట్ పాల్గొని మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో అమరులైన వీర సైనికులు నిజమైన హీరోలని  ఒక పుష్పం దేవుని మెడలో ఉండాలని. ఆడవారి జడలో ఉండాలని కోరుకోదు దేశం కోసం ప్రాణాలర్పించడానికి వెళ్లే సైనికుల పాదాల కింద పడి వేస్తే నగిలిపోయి నా జన్మ సార్థకం అవుతుంది పుష్పం కోరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దేశ రక్షణ కోసం ముందుండాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అలరించాయి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి  ఎస్ఎంసి కమిటీ చైర్మన్ ప్రభు శంకర్ ఉపాధ్యాయులు ప్రవీణ. రజిత.  శ్రీధర్ బాలకృష్ణ రఘు విజయలక్ష్మి సాయి లక్ష్మి ఇందిరమ్మ తోపాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు