విలువైనవి!!?; -సునీతాప్రతాప్, ఉపాధ్యాయిని, పాలెం.
ఉనికి ఉన్నప్పుడు
ఉప్పు విలువ తెలియదు
లేనప్పుడు తెలుస్తుంది!?

ఉనికి ఉన్నప్పుడు
సూర్యుని విలువ తెలియదు
లేనప్పుడు తెలుస్తుంది!!

ఉనికి ఉన్నప్పుడు
చంద్రుని విలువ తెలియదు
లేనప్పుడు తెలుస్తుంది!!!

ఉనికి ఉన్నప్పుడు 
ప్రాణం విలువ తెలియదు
లేనప్పుడు తెలుస్తుంది!!?

ఉనికి ఉన్నప్పుడు
అమ్మానాన్నల విలువ తెలియదు
లేనప్పుడు తెలుస్తుంది!!?

చదువుకున్న వానికి
చదువు విలువ తెలియదు
చదువు లేని వానికి తెలుస్తుంది!!?

ఉనికి ఉన్న అవయవాల 
విలువ మనకు తెలియదు
లేనివానికి వాటి విలువ తెలుస్తుంది!!?

ప్రేమించబడ్డ వానికి
ప్రేమ విలువ తెలియదు
వాడు ప్రేమించినప్పుడు
ప్రేమ విలువ తెలుస్తుంది!!?

బంగారు పంజరంలో
బంధించబడ్డ పక్షికి
స్వేచ్ఛ విలువ తెలుస్తుంది!!?

Sunita prathap teacher palem Nagar Kurnool district,8309529273

కామెంట్‌లు