పల్లె ప్రకృతీ వనాలు;-మాడుగుల మురళీధరశర్మ--సిధ్ధిపేట
కం.-1
పల్లెల ప్రకృతీ
వనములు
చల్లగ కాపాడుచుండు*
జవసత్తువలై!
ఉల్లములులసిల్లగనా
పల్లెలు పరిమళము
నొందు*
పరవశమొప్పన్!

కం-2
ఎకరా స్థలమును కనుగొని
నికరముగా శుభ్రపరచి*
నియమయుతముగా!
ప్రకటితమగు విధమునతా
నొకటొకటిగ వృక్షకంచె*
నుంచిన చాలున్!

కం-3
చిన్నని ఫల,విరి జాతుల
నెన్నుచునొక
వరుసయందు*
నేర్పరచుచునే!
కన్నుల విందు పసందగు
యెన్నో మొక్కలనుపెంచు*
మిష్టముతోడన్!

కం-4
పాదపథమ్ములు
నడకకు
సాదరముగ చుట్టుతిరుగ*
సమకూర్చుచునే!
ఆదరమును
గను రీతిని
పాదాచారులకు
ననువు*
పరచినచాలున్!

కం-5
నడుమన దట్టపు గుల్మము
లిడుచో వనశోభగాంచు*
నీప్సితసిధ్ధిన్!
కడుముద మందెడు విధమున
నడవిని సృష్టించవలెను*
నధ్భుతమొప్పన్!

కం-6
ప్రభుతల తలపుల వలపును
నభయారణ్యాలబోలు*
నందపు కూర్పున్!
ప్రభుయాదాద్రీ
విధముగ
శుభముల నందింపజేయు*
సుందర వనముల్!

కం-7
ఎల్లెడ హృది పులకింతలు
చల్లని శాంతి యును పొందు*
సర్వజనాళిన్!
పల్లెలు పచ్చదనమ్మున
వెల్లువగా విరిసి వర్ష*
వేగము పెరుగున్!

కం-8
హర్షిత జన మోదముగా
వర్షము కురియంగ సస్య*
పంటలు పండున్!
కర్షకులానందము గను
సర్షఫములు
పండు, భూమి*
సాగును పెరుగున్!

కం-9
నిర్వహణమ్మునుచేయగ
పర్వముగా బీదసాద*
భాగ్యోదయమై!
ఖర్వముగా
బీదత్వము
సర్వము దూరమ్మునగుచు*
సౌఖ్యముకలుగున్!

కం-10
పల్లెలు పట్టణ శోభిత
మల్లెలుగా తావి పంచు*
మహిమాన్వితమై!
యెల్లలులేని విధమ్మున
తల్లులుగా పేర్మిపంచు*
ధరణీతలమున్!

కం-11
పల్లెకు నొకవనమునుగొని
యెల్లరు గను హరితశోభ*
నేమారకనే!
పిల్లాపాపలు
గాంచగ
చల్లని హరితాంగస్పర్శ*
స్వాంతనమొసగున్!

కం-12
స్వఛ్ఛపు నాక్సీజనుతో
సఛ్ఛందనశాంతిసుఖము*
సౌభాగ్యములున్!
మెచ్చెడు
నారోగ్యములను
నిచ్చును ప్రకృతీవనాలు*
నిదమిధ్ధంగా!
🥭🌹🤝🍇🥙


కామెంట్‌లు