శబ్ద సంస్కృతి! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 శిలాహర్ అనే పదం ఒక రాజవంశం రాజకులం ని సూచించే పదం! వీరిలో మూడు శాఖలున్నాయి.ఉత్తర కొంకణ్ దక్షిణ కొంకణ్  మూడో శాఖ కొల్హాపుర్ సతారా బెల్గావ్ కి చెందిన శిలాహార్ రాజవంశీకులు. వీరు తమమూలపురుషుడు జీమూతవాహనుడని చెప్పుకుంటారు. ఆవంశంకి ఆపేరు రావటం వెనక ఓకథ ఉంది. శాపంపొందిన జీమూతవాహనుడు ఒక గంధర్వుడు. గరుడుడు రోజూ నాగులను భక్షించటంతో భయపడిన వాసుకి ఓశిలపై రోజూ ఒక పాముని  ఆహారం గా పంపేవాడు.ఒకేసారి  నాగులంతా గరుడునికి ఆహారం ఐతే కష్టం కదా?ఆరోజు శంఖచూడుడు అనే పామువంతు ! ఆశిలపై దిగాలుగా కూచున్న ఆపాముకి అభయంఇచ్చి జీమూతవాహనుడు తనే అక్కడ కూచున్నాడు. గరుడుడు  పాముని వదిలి జీమూతుని మింగుతూ ఉండగా (అతని తల ఇంకా పామునోట్లోకి పోలేదు) అతని భార్య  ఏడుస్తూ వచ్చి గరుడుని ప్రార్ధించింది.ఆమె దీనాలాపనతో గరుడుని గుండె కరిగి జీమూతవాహనుని బతికించాడు.అప్పటి నుంచి ఆవంశంవారికి శైలాహార్ శిలాహార్ అనే పేరు వచ్చింది. 🌷
కామెంట్‌లు