సుప్రభాత కవిత ; -బృంద
దిక్కు తోచని దారి తెలియని
ముందుకే తప్ప వెనుకకు
అడుగేసే వీలు లేని
పరిస్థితి

వెలుగే చుక్కాని
ఉదయమే ఊపిరి
అవని  తోడు
ఆకాశమే నీడ
అయినా ఆశే  అడుగు
వేయిస్తుంది

కోరిక ముందుకు
నడిపిస్తుంది.

కురవాలని వచ్చి
ఆగిన మబ్బులు

రావాల్సిన కిరణాలను
ఎంతసేపు ఆపగలవు?

నిశ్శబ్దం  నీ నేస్తం 
సంకల్పం  నీ దోస్తు..
ఆశే  నీ అస్త్రం
అదే  అవకాశం చూపే దారి
చిరునవ్వే నీ  ఆయుధం
ఆశయం.....నీ చుక్కాని

అనివార్యమైన ప్రయాణంలో
అద్భుతాలు చూడాలంటే
ఆచరణ ముఖ్యం......
ఆమనిని వెదుకుతూ సాగిపోవాలి

ఎడారిలో  ఏటినీటిలా
సంతోషాలు నీకు తెలియకనే
నీ చెంతకు  వస్తాయి.

శుభ ఆకాంక్షల తో శుభ ఉదయానికి
🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు