అలా నడక కోసం వెళ్ళానా
ఆకాశం మేఘావృతమై
మబ్బులతో మూసుకుపోయింది
వర్షపు ఛాయలు
మచ్చుకయినా లేవు ....!
ఉరుముల -డమరుకాలు
మెరుపుల ధగధగలు
మ్యూట్‌లో వున్నట్టున్నాయ్
వాతావరణం
శీతలాన్ని కప్పుకుంది !
కనీసం నాలుగు రౌండ్ల
మైండ్ ఫిక్సింగ్ వాకింగ్
నాలుగడుగులతోనే
ఆగిపొయింది ....!
కమ్మని గాలిమొదలై
చెట్టుకొమ్మలను -
ఫెళ్ళుమనిపించగల
హోరుగాలి --
ఊపందుకుంది !
నడకకు బ్రేక్ పలికి
తిరోగమనంలో --
రోడ్డెక్కానో లేదో ...
హోరుగాలి వెనక్కి తగ్గి
చిటపట చినుకుల అక్షింతలు
బట్టతలను చిట్లగొట్టే స్థాయికి
చేరుకున్నాయి .....!
రోడ్డు వరదై ప్రవహించింది
మరో దిక్కులేక ...
నేనూ అదేమార్గం -
ఎంచుకున్నాను ....!
జడివానలో తడిసి ..
తడిసిముద్దయ్యాను .....!!
***
ఆకాశం మేఘావృతమై
మబ్బులతో మూసుకుపోయింది
వర్షపు ఛాయలు
మచ్చుకయినా లేవు ....!
ఉరుముల -డమరుకాలు
మెరుపుల ధగధగలు
మ్యూట్‌లో వున్నట్టున్నాయ్
వాతావరణం
శీతలాన్ని కప్పుకుంది !
కనీసం నాలుగు రౌండ్ల
మైండ్ ఫిక్సింగ్ వాకింగ్
నాలుగడుగులతోనే
ఆగిపొయింది ....!
కమ్మని గాలిమొదలై
చెట్టుకొమ్మలను -
ఫెళ్ళుమనిపించగల
హోరుగాలి --
ఊపందుకుంది !
నడకకు బ్రేక్ పలికి
తిరోగమనంలో --
రోడ్డెక్కానో లేదో ...
హోరుగాలి వెనక్కి తగ్గి
చిటపట చినుకుల అక్షింతలు
బట్టతలను చిట్లగొట్టే స్థాయికి
చేరుకున్నాయి .....!
రోడ్డు వరదై ప్రవహించింది
మరో దిక్కులేక ...
నేనూ అదేమార్గం -
ఎంచుకున్నాను ....!
జడివానలో తడిసి ..
తడిసిముద్దయ్యాను .....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి