సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 ఇనుమా -బంగారమా
  ******
 ఇనుములానా -బంగారంలానా  ఎలా ఉండాలో నిర్ణయించుకునేది మన చేతుల్లోనే ఉంది.
 ఇనుముకు అన్నీ మంచి గుణాలే.ఒంట్లో ఇంట్లో ఇనుము లేనిదే గడవదు.
కానీ ఇనుము లాంటి మనసులో  అహం ఎప్పుడైతే పొడసూపుతుందో , గర్వం పెరుగుతుందో అప్పుడే పతనం ప్రారంభమవుతుంది.
నీటిలో తడిచినా,గాలిలో ఉంచినా ఇనుము తుప్పు పట్టినట్లుగా...
మనిషి ఇనుమలా అందరికీ ఉపయోగపడేలా అందుబాటులో ఉంటూనే,
మనసు అందరూ గౌరవించేట్లుగా బంగారంలా ఉండాలి.
మనసు బంగారంలా, అంతరాత్మ ఇనుములా ఎల్లప్పుడూ సేవాభావంతో చురుగ్గా వుంటూ గౌరవం పొందాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు