మన ఆర్ధిక శాస్త్రవేత్తలు.;-రఘురాం రాజన్ . -డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
  భారతదేశపు ఆర్థికవేత్త, షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆచార్యుడు. 2003 నుంచి 2006 మధ్యలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ముఖ్య ఆర్థికవేత్తగా, రీసెర్చ్ డైరెక్టరుగా పనిచేశాడు. 2013 సెప్టెంబరు నుంచి 2016 సెప్టెంబరు వరకు భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరుగా పనిచేశాడు. 2015లో రిజర్వు బ్యాంకు పదవిలో ఉండగానే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వైస్ ఛైర్మన్ గా నియమితుడయ్యాడు.
2013 సెప్టెంబరు 4 – 2016 సెప్టెంబరు 4
అంతకు ముందు వారు
దువ్వూరి సుబ్బారావు
తరువాత వారు
ఉర్జిత్ పటేల్
15వ భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు
2012 ఆగస్టు 10 – 2013 సెప్టెంబరు 4
అంతకు ముందు వారు
కౌశిక్ బసు
తరువాత వారు
అరవింద్ సుబ్రమణియన్
7వ అంతర్జాతీయ ద్రవ్యనిధి ముఖ్య ఆర్థికవేత్త
2003 సెప్టెంబరు 1 – 2007 జనవరి 1
అంతకు ముందు వారు
కెన్నెత్ రోగాఫ్
తరువాత వారు
సైమన్ జాన్సన్
వ్యక్తిగత వివరాలు
జననం
1963 ఫిబ్రవరి 3 (వయస్సు 59)
భోపాల్, మధ్యప్రదేశ్
జీవిత భాగస్వామి
రాధిక పూరి
కళాశాల
ఐఐటీ ఢిల్లీ (బి.టెక్)
ఐఐఎం అహ్మదాబాద్ (ఎం.బి.ఎ)
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (పి.హెచ్.డి)
నైపుణ్యం
ఆర్థికవేత్త
సంతకం

2005 లో ప్రతి సంవత్సరం జరిగే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కౌన్సిల్ సమావేశంలో రఘరాం రాజన్ ఆర్థిక వ్యవస్థలో ఆపదలు పొంచి ఉన్నాయనీ వాటిని అధిగమించేందుకు కొన్ని విధానాలు ప్రతిపాదించాడు. అయితే అమెరికా మాజీ ట్రెజరీ కార్యదర్శి లారెన్స్ సమ్మర్స్ ఇవి నిరాధారమైనవనీ, రఘురాం వ్యాఖ్యలని కొట్టి పారేశాడు. అయితే 2007-2008 లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలకు విలువ పెరిగింది. 2010 లో విడుదలైన ఇన్ సైడ్ జాబ్ అనే అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ సినిమాకు గాను, ఆయనను విస్తృతంగా ఇంటర్వ్యూ చేశారు.
2003 లో అమెరికన్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆర్థిక శాస్త్రంలో సైద్ధాంతికంగా, ప్రాయోగికంగా అద్భుతమైన ప్రజ్ఞ కనబరిచిన 40 సంవత్సరాల వయసులోపు వ్యక్తులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఇచ్చే ఫిషర్ బ్లాక్ ప్రైజును మొదటిసారిగా ప్రధానం చేశారు. 2010 లో ఆయన రాసిన ఫాల్ట్ లైన్స్: హౌ హిడెన్ ఫ్రాక్చర్స్ స్టిల్ థ్రెటెన్ ద వరల్డ్ ఎకానమీ అనే పుస్తకాన్ని ఫైనాన్షియల్ టైమ్స్/గోల్డ్ మన్ శాక్స్ వారు బిజినెస్ బుక్ ఆఫ్ ది యియర్ గా ప్రకటించారు. 2016 లో టైం మ్యాగజీన్ వారు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వందమంది ఉత్తమ వ్యక్తుల్లో ఒకరిగా ఎంపిక చేసింది. 
భారత ప్రభుత్వ ఆర్ధిక సలహా దారైన కృష్ణమూర్తి వెంకట సుబ్రమణ్యం ( కృష్ణమూర్తి సుబ్రమణ్యం) రఘురాం రాజన్ పర్యవేక్షణలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ( పి.హెచ్.డి ) చేసారు.కామెంట్‌లు