ప్రపంచంలో తల్లి నవమాసాలు మోసి బిడ్డను కని ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్ది సమాజానికి అప్పజెబుతుంది. కనుకనే ఆమెకు దేవతగా ప్రథమ స్థానం ఇచ్చారు మన పెద్దలు. అలాగే తండ్రి బిడ్డను చేయి పట్టుకొని నడిపించాడు బిడ్డ ఇష్టానుసారం తనకు కావలసిన కోరికలన్నీ తీర్చి సమాజంలో వ్యక్తిగా నిలబెట్టి నవాడు కనుక దేవుని రూపంలో ద్వితీయ స్థానాన్ని పొందాడు. రక్త సంబంధాలు లేక ఎక్కడినుంచో బ్రతుకుతెరువు కోసం వచ్చి బిడ్డకు అక్షరాలు నేర్పించి వాడిని ఉత్తమ పౌరునిగా తయారు చేసిన గురువుకు దేవతా స్వరూపంలో తృతీయ స్థానం ఇచ్చారు మన పెద్దలు. నిజానికి ఈ ముగ్గురు లేకపోతే బిడ్డ జీవితం ఏమవుతుంది? ఎక్కడో కూలిపని చేసుకుంటూ దిక్కులేకుండా బతకవలసి వస్తోంది. కనుక ఆ ముగ్గురిని భగవత్స్వరూపంగా కొలిచాడు వేమన.జీవితంలో తాను సంపాదించి స్థిరపడి వివాహమై కారణాలేవైనా కావచ్చు భార్యచెప్పే మాటలు విని కానీ తన సంపాదనతో తల్లి దండ్రుల కష్టాన్ని కూడా మాత్రమే చూడకుండా తన స్వార్థంతో పెండ్లి కుమారుడు బ్రతికేలా వేరు పడాలని భావిస్తాడు తల్లిదండ్రులను పట్టించుకోడు. పుట్టలోన చెదలు ఏవిధంగా పుడుతుందో, ఎక్కడికి పోతుందో, ఎవరికీ తెలీదు. ఎందుకు పుట్టిందో ఏ పని చేస్తుందో ఎలా చనిపోతుందో ఏ ఒక్కరికీ తెలియదు. ఇలాంటి కొడుకుని అలాంటి చీడ పురుగుతో జమకట్టాడు వేమన.
దయలేని పుత్రుడు ;-ఏ.బి ఆనంద్,విజయవాడ,ఆకాశవాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి