పాఠశాల మైదానం;---గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు.
తల్లి వంటి మైదానం
బాలలకు బహు ఇష్టం
పాదాలతో తాకినా
పొంగిపోవు ప్రేమగుణం

పిల్లలకు ఆట స్థలం
ప్రార్ధనకు ఉపయోగం
వేడుకలు జరిగినచో
అందించును సహకారం

అమ్మలాంటి హృదయం
సహనానికి నిలయం
పాఠశాల మైదానం
త్యాగానికి నిదర్శనం

గగనమంత పెద్ద మనసు
అది అందరికీ తెలుసు
మైదానం గొప్పదనం
వర్ణించుట ఎవరి తరం?


కామెంట్‌లు