ప్రసిద్ధ సాహితీ వేత్తలు..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 మాక్సింగోర్కీ బాల్యం నించి పుస్తకాలపురుగు.ఓపాతపుస్తకాలు పేపర్ షాపు లో  పనిచేసే వాడు.టైం దొరికినప్పుడు కష్టపడి అక్షరాలు కూడబలుక్కుని చదివి ఆత్మ తృప్తి పొందాడు. కానీ ఓకథ తళుక్కున బుర్రలో మెరవటం పేపర్ కి పంపటం అది పబ్లిష్ కావటంతో అతనిలోని రచయిత విజృంభించాడు.ఓప్రసిద్ధ రచయిత అభినందిస్తూ లేఖరాయటంతో రెట్టింపు ఉత్సాహంతో రాయటం అలా"మదర్" తో ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు.మరి మన తెలుగు సాహిత్యంలో ఎందరో గొప్ప వారు భారతీయులకే తెలీదు. కారణం!అనువాదాలు లేక!హిందీ సాహిత్యం ఈవిషయంలో చాలా ముందు ఉంది. 
అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ మాటకారి కూడా. అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ హకిల్ బెరీఫెన్ పిల్లల కి చాలా నచ్చిన రచనలు.ఓసారి పొరుగాయన ఇంట్లో చాలా పెద్ద లైబ్రరీ లో బోలెడన్ని పుస్తకాలు చూశాడు. "నాకు ఈపుస్తకం ఇస్తారా?వెంటనే చదివి ఇచ్చేస్తా?"అని అడిగాడు. "మార్క్!కావాలి అంటే ఇక్కడే కూచుని చదువుకో!ఇంటికి ఇవ్వను అన్నాడు. మారుమాట్లాడకుండా తిరిగివచ్చాడు. కొన్ని రోజులకి ఆపొరుగాయన వచ్చి "మార్క్!మీ లాన్ మూవర్ ని ఇస్తావా?"అని అడిగాడు. గడుసు మార్క్  జవాబు ఇది"అలాగే!దాన్ని మీఇంటికి తీసుకుని వెళ్లటానికి వీల్లేదు. నా లాన్ లోనే నీవు ఉపయోగించుకో!"పాపం!పొరుగాయన మొహం మాడిపోయిందని వేరే చెప్పాలా?"
ఇక భార్యతో అతని మాటతీరు  ఎలా ఉండేదో చూద్దాం!"అంకుల్ టామ్స్ కాబిన్"తో ఖ్యాతి గాంచిన  హారీ బీచర్ స్టోన్ ని కలిసి పిచ్చా పాటీ మాట్లాడి ఇల్లు చేరిన మార్క్ ని భార్య  నిలదీసింది "ఏంటీ! ఇలా బుద్ధావతారంగా అంతపెద్ద రచయిత్రిని కలవటానికి వెళ్లారా?" "అంటే!"అమాయకంగా అడిగాడు. "నెక్ టై కట్టుకుని వెళ్లాలి అని  మీకు తెలీదా?" దుమ్మెత్తిపోసింది.వెంటనే  తన నెక్ టై ని బీరువాలో నించి తీసి చక్కగా కవర్లో పెట్టి ఆమెకు ఓలేఖ రాశాడు "మేడం! టై కట్టుకోకుండా మిమ్మల్ని కల్సినందుకు నాఅనాగరిక ప్రవర్తన కు మాఆవిడ అక్షింతలు వేసి  దుమ్ము దులిపింది.నేను మీతో మాట్లాడింది కేవలం  ఓఅరగంట! అందుకే  నేను పంపే నాటైని మీదగ్గర ఓఅరగంట ఉంచుకొని  ఈకవర్ తెచ్చిన అబ్బాయి చేత తిరిగి పంప ప్రార్ధన! నాకు  ఇదొక్కటే ఉంది. దయచేసి తిరిగి పంపండి. "అని  ఆ కవరుని ఓకుర్రాడిచేత పంపాడు.ఆతని సతీలలామ ఎలా వేగిందో ఆతర్వాత ఏంజరిగిందో తెలీదు. 🌹

కామెంట్‌లు