అతడు!!; - ప్రతాప్ కౌటిళ్యా
తేనెటీగ కుడితే విషం వస్తుంది
కూడబెడితే
తీయని తేనె వస్తుంది!!?

పల్లె పడుచు తోడుగా ఉంటే
పంచామృతం పంచి పెడుతుంది!!

ఈ గడ్డపై
అగ్నిపర్వతాలు పేలినవి
నీళ్లు గడ్డ కట్టినవి-లావాలు పొంగినవి
గనులు మండినవి

ఆకాశంలో ఆమె ఒక వానై కురిస్తే
చల్లని నదులు రెక్కలు కట్టుకొని
పచ్చని భూమిపై పక్షుల్లా కదిలినవి!!
మనసు లేని భూమిపై
మనుషులతో నింపినవి!!!

మండుతున్న సూర్యుని గుండెలో
తీయని వెండీ వెలుగులు
కొండ చాటు నుంచి వెన్నెల వెన్న ముద్దలు
కలిసి ఊరంతా వెలిగిపోతుంది!!

వన్యప్రాణులు
ప్రణయ ప్రయాణంలో ఉన్నాయి!!?

తోట నవ్వితే పూల తోటలో
తోటి పువ్వులు ఎగిరిపోతూ
ఏడు రంగుల ఇంద్ర భవనంపై వాలిపోతున్నవీ!!

కాలి అందెల అందాలు
శబ్దాల అద్దంలో తొంగిచూసినట్లు
చెవులు ఆశ్చర్యపోతున్నవి!

ప్రపంచాన్ని జయించిన కత్తులు తుపాకులు
ఆమె ఇచ్చిన తమలపాకుల్లో
నమిలివేయబడ్డట్లు
ఆమె పాదాల కింద పడి ప్రాణం వదిలినట్లు
హృదయం చెప్తోంది!!!

కఠినమైన మాటలు మండుతున్న కోపం
ఎండిపోయిన గుండె
నిరాశ కోటలో జెండా పాతితే
అదృశ్య స్పర్శతో అదృష్ట దేవత కనిపిస్తే

సుడిగాలి వీచింది జడివాన కురిసింది
హృదయ సాగరంలో
ఒక చేప పిల్ల స్వేచ్ఛగా వదిలివేయబడింది!!

రామ రామ అన్న కోతి
ఆంజనేయుడైనట్లు!!

ప్రేమ ప్రేమ అన్న వేమన్న
యోగి అయినట్లు!!

ఆమె ఆమె అన్న అతడు
పరమాత్ముడైనాడు!!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు