అనుమానం! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజు శ్రేణికుడికి తన భార్య  చేలన శీలం పై అనుమానం కలిగింది. అది పెనుభూతంగా మారింది. "ఆమె ఉండే అంత:పురానికి నిప్పు అంటించు"అని సేనాపతి కి ఆమూర్ఖుడు ఆజ్ఞాపించాడు. కానీ ఆసేనాపతి విచక్షణ వివేకం కలవాడు. రాజు పిచ్చి కోపంతో ఉన్నాడని గ్రహించి ఒక సేవకుని భగవాన్ మహావీరుని దగ్గరకు పంపాడు.సంగతంతా తెల్పాడు.రాజు కి మహావీరుడు అంటే ఎంతో భక్తి విశ్వాసాలు నమ్మకం కూడా! హఠాత్తుగా తనదగ్గరికి వచ్చిన  భగవాన్ ని చూసి "స్వామీ!కబురంపితే నేనే వచ్చేవాడినికాదా?" అని రాజు వినమ్రంగా అన్నాడు. "అప్పటిదాకా ఉంటే అనర్థం జరిగిపోతుంది రాజా" "స్వామీ!మీమాటలు నాకు అర్ధం కావటంలేదు. " "రాజా! సందేహం  అనుమానం అనేవి ఒక పెద్ద తుఫాను సుడిగుండం లాంటివి. అలాంటిచోట ఓడ అల్లాడి మునిగి పోతుంది. నీవు కూడా అనుమానపు తుఫానులో కొట్టుకుపోతున్నావు." "భంతే!మీరు అనేది నాకు అర్ధం కావటంలేదు. " "రాజా!నేను నా అంతరదృష్టితో చూశాను. రాణి చేలక ఎంతో నిర్మల పవిత్రవంతురాలు.ఆమెను నీవు శంకించటం అమానుషం! ఇప్పటికైనా అంత:పురానికి నిప్పు పెట్టే ఆలోచనను మానుకుంటావా?" అంతే!రాజు పశ్చాత్తాపం తో ఆయన పాదాలపై పడ్డాడు.తెలిసీ తెలీకుండా  చెప్పుడు మాటలతో ఒకరిని అనుమానించటం తగదు.సంగతి తెలిసినా  గప్ చిప్ గా ఉండాలి. ఇంకోరి చెవి కొరకరాదు.ఇదిగో పులి అంటే అదుగో తోక అనే లోకంలో పుకార్లు షికార్లు కొట్టి మనకు  ఇతరులకు హాని చేస్తాయిసుమా!🌹
కామెంట్‌లు