:నేనేనా;-సి.హేమలత-పుంగనూరు
అలవాటైనా ముబైల్ వదలాలంటే
తెగ బాధపడి పోయే మనం
అలవాటైన మనిషిని మనసును
ఎలా వదులుకోవడం ఆలోచించరే

మాటమాట పెరిగినప్పుడు
మనవారిని బాధపెట్టే మాటలు
మాట్లాడక మౌనం వహిస్తే ఏమౌద్ది

నీ ప్రేమ నీధరి చేర సంయమనం
పాటిస్తే..నేనే తగ్గాలి అను అసహనం వీడితే 
గువ్వలా ఎదపై ఒదిగి మౌనంగా నీ హృదయస్పందన ఆస్వాదిస్తే..


అలుసా..కాదేమో బహుశా
నీ మనసుతో మమేకవడానికి
నీ చాతుర్యం..కదా..కాదంటావా
నాకేందుకనుకుంటావా

ఎప్పుడూ నేనేనా ప్రేమకు లేదా ప్రేమ ను 
చేరదీయాలని సంగ్ధిద్దం పడక
నాదైన మజిలీలో నా అంతరంగికుల వద్ద 
ప్రేమపదిలం అని గుర్తించుకో ఓ మనసా

పంతం పూనితే స్వార్ధపూరితం అవుతుంది.
నేనేం త్యాగశీలి నాఅనుకోకు...కాదంటే ఎలా 
ప్రేమ బంధం విడదీయలేని ది..విలువైనదీను
కొందరితో బంధం బంధీఅవడమే సంతోషం ..
కాదని కాలరాశామో
జ్వాలై నేనేనా అనునది బూడిదౌతుంది.


కామెంట్‌లు